SDPT: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో శనివారం శ్రీ మల్లికార్జున స్వామివారు దివ్యమైన విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు స్వామివారికి పవిత్ర జలాలతో అభిషేకాలు, పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శనివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ
కొమురవెల్లిలో మల్లన్న దివ్యదర్శనం


