KKD: పిఠాపురం వైఎస్ఆర్ గార్డెన్‌లో పేకాట ఆడుతున్న 9 మందిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఎస్సై వి. మణికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడిలో రూ. 57,300 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. 9 మంది అరెస్ట్


