వరంగల్ నగరంలోని రంగశాయిపేటలో గుర్తుతెలియని వాహనం ఢీకొని సుమారు 80-85 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందిన ఘటన దూపకుంట రోడ్డులోని ఎంఎం నగర్ వద్ద శుక్రవారం జరిగింది. సమాచారం అందుకున్న మిల్స్‌కాలనీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. వృద్ధురాలి వివరాలు తెలియకపోవడంతో మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీలో భద్రపరిచారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వృద్ధురాలి మృతి


