W.G: భీమవరం పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యలపై కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. శివారు ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి, పైప్‌లైన్లలో మురుగునీరు చేరుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 4, 5వ వార్డుల శివారు ప్రాంతాలకు కొత్త పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని, తాగునీటి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి సమస్యను పరిష్కరించాలి: కేంద్రమంత్రి


