హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిపై కేసు నమోదు

ATP: ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మరో 18 మంది YCP నాయకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ మహానంది తెలిపారు. గుంతకల్లు పోలీసు సబ్ డివిజన్‌లో 30 పోలీసు చట్టం అమల్లో ఉన్నా అనుమతి లేకుండా సాగునీటి కోసం జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారని వెల్లడించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు ప్రత్యేక ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.