సత్యసాయి: తన సతీమణి పల్లె ఉమా 8వ వర్ధంతి వేడుకలు ఆగస్టు 30న నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. రాప్తాడు మండలం ప్రసన్నాయనపల్లి పల్లె వ్యవసాయ క్షేత్రంలోని నివాళి ఘాట్ వద్ద ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, ప్రజలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
పల్లె ఉమా వర్ధంతి వేడుకలకు ఏర్పాట్లు


