హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాణిపాకంలో వైభవంగా గరుడోత్సవం

CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా శుక్రవారం రాత్రి గరుడ సేవను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గరుడ వాహనంపై కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ కోదండపాణి పాల్గొన్నారు.