హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బాధిత కుటుంబాలను ఆదుకోవాలి'

PLD: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏలూరు గ్రామానికి చెందిన దళిత వ్యవసాయ కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రవిబాబు డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి మెరుగైన వైద్యం, బాధిత కుటుంబాలకు రెండేసి ఎకరాల భూమి కేటాయించాలని కోరారు.