హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు కాకినాడ రక్త దాన శిబిరం ఏర్పాటు... SP

కాకినాడ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. పోలీస్ కళ్యాణ మండపం, కాకినాడలో ఈ రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. ప్రజలు, పోలీసు సిబ్బంది, యువత స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కోరారు.