అన్నమయ్య: శ్రావణ పౌర్ణమి సందర్భంగా కన్యతీర్థంలోని శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని 2 లక్షలకు పైగా గాజులతో నయనమనోహరంగా అలంకరించారు. రూ.80 వేల విలువైన గాజులను అలంకరణకు వినియోగించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. శ్రీచక్రపూజ, సహస్రనామార్చనలు, అభిషేకాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గాజులతో కనువిందు చేసిన అమ్మవారు


