కోనసీమ: ముమ్మిడివరంలోని ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఆర్. వహీదా తెలిపారు. జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో జరిగే ఈ మేళాలో 10 ప్రముఖ కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. 18 నుంచి 35 ఏళ్ల వయసున్న యువతీ యువకులు అర్హులని స్పష్టం చేశారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ముమ్మిడివరంలో మెగా జాబ్ మేళా


