హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేర్యాల–ఉప్పల్‌కు కొత్త ఆర్టీసీ బస్సు

SDPT: స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజ్ఞప్తితో ఆర్టీసీ యాజమాన్యం చేర్యాల నుంచి హైదరాబాద్ ఉప్పల్ రింగ్‌రోడ్డు వరకు నూతన బస్సును ప్రారంభించింది. ఘట్‌కేసర్ మీదుగా సాగే ఈ సర్వీస్ వల్ల నగర ఆసుపత్రులకు వెళ్లే రోగులు, ఉద్యోగులు, విద్యార్థులకు ప్రయాణం సులువవుతుంది. చేర్యాల వరకు బస్సు పొడిగించడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.