హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కల్లాపి పౌడర్ తాగి మహిళ మృతి

KDP: కలమల్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మేకలబాలయ్యపల్లెలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బండ గురుదేవి సౌభాగ్య కల్లాపి పౌడర్‌ను నీటిలో కలిపి తాగడంతో కుటుంబ సభ్యులు ఆమెను ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.