ADB: బోథ్ మండలంలోని వేదం ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థిపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటనలో టీచర్‌తో పాటు పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు SI పురుషోత్తం తెలిపారు. ఈనెల 27న తరగతి గదిలో క్లాస్‌టీచర్ బాలుడిని చెవులు పట్టుకుని, చెంపలపై, శరీరంపై తీవ్రంగా కొట్టినట్లు పేర్కొన్నారు. తల్లి ఫిర్యాదు మేరకు జేజే యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
తెలంగాణ
VIDEO: విద్యార్థిపై టీచర్ దాడి..!


