హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైస్ మిల్లులో విజిలెన్స్ తనిఖీలు

MDK: రామాయంపేట మండలంలోని అక్కన్నపేట శివారులో ఉన్న శ్రీ భద్రకాళి రైస్ మిల్లులో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ప్రభుత్వం కేటాయించిన ధాన్యం నిల్వలతో పాటు రికార్డులను అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా తనిఖీ చేసి నమోదు చేసుకున్నారు. అక్రమాలు అరికట్టడమే లక్ష్యంగా ఈ విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు.