హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాంగ్‌రూట్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు: ఎస్పీ

KDP: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 455 కేసులు నమోదు చేసి రూ.1,02,939 జరిమానా విధించినట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. రాంగ్‌రూట్‌లో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.