హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంఆర్ బకాయిలపై కేసు నమోదు

PDPL: మంథని పవన సుత రైస్ మిల్ సీఎంఆర్ బియ్యం బకాయిలపై కేసు నమోదు చేసినట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. 2021-22 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి 2,821.915 మెట్రిక్ టన్నుల బియ్యం బకాయి ఉండగా, 25 శాతం పెనాల్టీతో కలిపి డిఫాల్ట్ విలువ రూ.12.28 కోట్లుగా తేల్చారు. మిల్ యజమాని పవన్ కుమార్, ట్రక్ చిట్టీలపై సంతకం చేసిన నవీన్ కుమార్‌పై కేసు నమోదు చేశారు.