NTR: ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై ఈవో శ్రీనివాస్ నాయక్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున క్యూ లైన్లు, తాగునీరు, పారిశుధ్యం, వైద్య సదుపాయాలపై ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. తాత్కాలిక షెడ్లు, విద్యుద్దీపాలంకరణ, భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్లపై సమీక్ష


