హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సైబర్ నేరాల నివారణపై ఎస్సై అవగాహన

NTR: సైబర్ నేరాల నివారణపై జగ్గయ్యపేట గౌతమ్ బుద్ధ పార్కులో ఎస్సై రాజు ప్రజలకు అవగాహన కల్పించారు. ఆన్‌లైన్, OLX, పార్ట్‌టైమ్ జాబ్, క్రెడిట్ కార్డ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. OTP, UPI, QR కోడ్ వివరాలను ఇతరులతో పంచుకోవద్దని, అపరిచితులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని హెచ్చరించారు.