SRCL: చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ జాతీయ కవి, బహుభాషావేత్త డా. పెరుక రాజు ఆధ్వర్యంలోని ‘మై గిఫ్ట్’ కార్యక్రమంలో హైదరాబాద్ ఆర్మీ క్యాంపస్‌లో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. జవాన్లకు రాఖీలు కట్టి, మిఠాయిలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దేశ రక్షణలో సేవలందిస్తున్న సైనికులకు ప్రజల ఆత్మీయతే నిజమైన రక్ష అని డా. పెరుక రాజు పేర్కొన్నారు.
తెలంగాణ
జవాన్లకు ఆత్మీయ రక్షాబంధన్


