హైదరాబాద్: 28°C
తెలంగాణ

పారదర్శక ఓటరు జాబితాకు చర్యలు: కలెక్టర్

GDWL: పారదర్శక ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా SIR నోటీసుల పంపిణీ వేగవంతం చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. 594 పోలింగ్ కేంద్రాల పరిధిలో 1,49,281 నోటీసులకు గాను 11,385 పంపిణీ చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓటర్లు గుర్తింపు కార్డులతో హియరింగ్‌కు హాజరుకావాలని సూచించారు. మిగిలిన నోటీసులను త్వరగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.