హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో నారాయణపేట సత్తా

NRPT: హనుమకొండలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో నారాయణపేట క్రీడాకారులు సత్తా చాటారు. అండర్-16లో 600 మీటర్ల విభాగంలో పూజ స్వర్ణ పతకం సాధించారు. అండర్-18 హైజంప్‌లో రత్నప్రియ వెండి, రాధిక కాంస్య పతకాలు గెలుచుకున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి రమణ తెలిపారు. విజేతలను ఖేలో ఇండియా కోచ్‌లు అభినందించారు.