హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ సరఫరాకు అంతరాయం

KNR: వావిలాలపల్లి 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం పరిధిలోని క్రిస్టియన్ కాలనీ 11 కేవీ ఫీడర్‌లో శనివారం లైన్ మరమ్మతు పనులు చేపట్టనున్నారు. దీంతో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మెడికవర్ వెనుక వైపు, సవరన్ వీధి, రెడ్డి రెసిడెన్సీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. వినియోగదారులు సహకరించాలని ఏఈడీ పి. శ్రీనివాస్ కోరారు.