హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కారు బీభత్సం.. తప్పిన ప్రాణనష్టం

అన్నమయ్య: పుల్లంపేట మండలం అనంతంపల్లి వద్ద తిరుపతి–కడప ప్రధాన రహదారిపై శుక్రవారం కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు ఆగి ఉన్న బైక్‌ను ఢీకొట్టి విద్యుత్‌ స్తంభాన్ని కూల్చింది. బైక్‌ ధ్వంసమైనా ప్రాణనష్టం తప్పింది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున అనంతంపల్లి వద్ద స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు అధికారులను కోరారు.