హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ సీఎం జగన్‌పై లోకేశ్ విమర్శలు

ప్రకాశం: మంత్రి లోకేశ్ మాజీ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తాము చేసిన పనుల క్రెడిట్ చోరీ చేసే వ్యక్తి అని, వెలిగొండ ప్రాజెక్ట్ పనులు పూర్తి కాకుండానే ప్రారంభించారని మండిపడ్డారు. డీఎస్సీపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ ఏడాది, వచ్చే ఏడాది కూడా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. వైసీపీ హయాంలో బీసీలను ఇబ్బంది పెట్టారని, తమ పార్టీ నేతలపై పెట్టిన దొంగ కేసులు ఎత్తివేస్తామన్నారు.