కోనసీమ: అమలాపురం మండలంలోని పేరూరు, కామన గరువు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఈఈ రాంబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్తు మెయింటినెన్స్ పనుల నిమిత్తం ఈ అంతరాయం ఏర్పడుతుందన్నారు. వినియోగదారుల సహకరించాలని కోరారు.
వార్తలు
నేడు అమలాపురంలో పవర్ కట్


