NLR: మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అన్నారు. నెల్లూరు మత్స్యశాఖలో జరిగిన సహకార సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 వరకు ఉన్న సబ్సిడీ పథకాలను వైసీపీ నిర్వీర్యం చేసిందని, వాటిని పునరుద్ధరించేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నారన్నారు. మత్స్యకారుల సమస్యలపై సీఎం చంద్రబాబు వద్దకు వెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'మత్స్యకారులకు అండగా కూటమి'


