ATP: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు బ్రహ్మకుమారీలు, మహిళలు, దివ్యాంగులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతపురం కలెక్టరేట్‌లో ఈ వేడుక సాగింది. ఎంపీ మాట్లాడుతూ రాఖీ పండుగ ప్రేమానురాగాలకు, ఆత్మీయతకు ప్రతీక అని పేర్కొన్నారు. జిల్లాలోని అక్కాచెల్లెమ్మలు, అన్నదమ్ములకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీకి రాఖీలు కట్టిన బ్రహ్మకుమారీలు


