SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ శివ పరాశక్తి పీఠంలో శ్రావణ పౌర్ణమిన పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం గోపూజలు ఘనంగా జరిగాయి. పీఠాధిపతి మనోహర్ రాజు గురూజీ దంపతులు గోవులకు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. గోవు ముక్కోటి దేవతలకు ప్రతీక, ప్రతి ఇంట్లో గోవు ఉండాలని, గోరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గురూజీ పిలుపునిచ్చారు.
తెలంగాణ
శివా పరాశక్తి పీఠంలో ఘనంగా గోపూజలు


