హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూనిఫామ్‌ల నాణ్యత పాటించాలి: అదనపు కలెక్టర్‌

KMR: లచ్చిపేటలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాల యూనిఫామ్‌ తయారీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌ ఎన్‌.వై.గిరి సందర్శించారు. యూనిఫామ్‌ల తయారీని పరిశీలించి, మహిళా సంఘాల సభ్యులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్‌ల తయారీలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని, దుస్తుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు.