MDK: వెల్దుర్తి మండలం తిర్మలాపూర్, తుజాల్పూర్ గ్రామాల నుంచి ఖాజీపేట వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారి ప్రయాణికులకు తీవ్ర నరకం చూపుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు కంకర తేలిపోవడంతో రోడ్డంతా గుంతలమయమైంది. నిత్యం రైతులు, విద్యార్థులు, వాహనదారులు ఈ దారిలోనే రాకపోకలు సాగిస్తూ అవస్థలు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలన్నారు.
తెలంగాణ
గుంతలమయంగా ప్రధాన రహదారి


