JGL: రాయికల్‌కు చెందిన సరిత, ముస్లిం మతస్థుడైన మున్నుకు చిన్ననాటి నుంచి ప్రతి రాఖీ పౌర్ణమికి రాఖీ కడుతున్నారు. ఏటా కొనసాగుతున్న ఈ ఆత్మీయ అనుబంధం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. మతాలు వేరైనా ప్రేమ, సోదరభావానికి ఎలాంటి హద్దులు లేవని వీరి బంధం చాటుతోంది. పరస్పర ఆప్యాయతతో పండుగను జరుపుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
తెలంగాణ
మతసామరస్యానికి ప్రతీక ఈ అనుబంధం!


