హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాత వరిపేటలో 7.5 గ్రాముల బంగారం చోరీ

MNCL: కాసిపేట మండలం పాత వరిపేటకు చెందిన రాజు ఇంట్లో చోరీ జరిగింది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఈనెల 26న రాజు తన కుటుంబంతో కలిసి జైపూర్‌లో శుభాకార్యక్రమానికి హాజరయ్యారు. శుక్రవారం ఇంటికి తిరిగి వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉంది. బీరువాలోని 7.5 గ్రాముల బంగారం చోరీకి గురయ్యాయన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.