హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బుచ్చిలో 29 అజెండాలకు ఆమోదం

NLR: బుచ్చి మున్సిపాలిటీలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో 29 అజెండాలకు ఏకగ్రీవ ఆమోదం తెలిపినట్లు ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి తెలిపారు. మొత్తం 31 అజెండాలను ప్రవేశపెట్టగా 29కు ఆమోదం లభించిందన్నారు. ఒక అజెండాను వాయిదా వేయగా, మరో అజెండాను తొలగించినట్లు పేర్కొన్నారు. సమావేశానికి సహకరించిన కౌన్సిల్ సభ్యులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.