హైదరాబాద్: 28°C
తెలంగాణ

బేతిగల్‌లో ఎస్ఐఆర్ ఓటరు జాబితా పరిశీలన

KNR: వీణవంక మండలం బేతిగల్‌లో ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాలను తహసీల్దార్ ముద్దసాని రమేష్ శుక్రవారం పరిశీలించారు. జాబితాలో నాన్‌ మ్యాపింగ్, ఓట్ల నమోదులో తేడాలను గుర్తించి సంబంధితులకు నోటీసులు జారీ చేశారు. ఓటర్ల నుంచి అభ్యంతరాలను స్వీకరించి, సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.