WNP: పెబ్బేరు మండల ప్రజలకు కమ్యూనిటీ పోలీసింగ్‌పై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక ఎస్సై వెంకటేశ్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దొంగతనాలు, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు. ప్రజలు శాంతి భద్రతలకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
కమ్యూనిటీ పోలీసింగ్‌పై అవగాహన


