KNR: గంగాధర మండలం ఇస్లాంపూర్‌లో రేపటి నుంచి భూ భారతి రీ సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తహసీల్దార్ అంబటి రజిత గ్రామస్థులతో సమావేశమై 15 రోజులపాటు జరిగే సర్వే వివరాలను వివరించారు. భూ వివరాల నమోదు, సర్వే ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ బారాజు ప్రభాకర్, పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఇస్లాంపూర్‌లో భూ భారతి రీ సర్వే


