హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

న్యాయవాదులు విధులు బహిష్కరణ

AKP: ఏపీలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను తక్షణమే రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యలమంచిలి బార్ అసోసియేషన్ న్యాయవాదులు శుక్రవారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. న్యాయవాదులకు వృత్తిపరమైన భద్రత కల్పించాలని కోరారు. రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ తరహాలో ఏపీలోనూ ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.