హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రిడిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేయాలి: కలెక్టర్

కోనసీమ: అమలాపురం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధ్యక్షతన రెండో జాబితా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. అక్రిడిటేషన్ దరఖాస్తులు, ధ్రువపత్రాలు, అభ్యంతరాలు, క్రిమినల్ కేసులను నిబంధనల మేరకు పరిశీలించి అర్హులైన జర్నలిస్టులకు కార్డులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు.