హైదరాబాద్: 28°C
తెలంగాణ

బషీర్ బాగ్ విద్యుత్ అమరులకు నివాళులు

PDPL: గోదావరిఖని శ్రామిక భవన్ ఆవరణలో సీఐటీయూ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ విద్యుత్ అమరులకు నివాళులు అర్పించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, నాయకులతో కలిసి అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 2000 ఆగస్టు 28న బషీర్‌బాగ్‌లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ప్రజలపై కాల్పులు జరిపారన్నారు.