ములుగు (D)లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ రావడంతో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. వెంకటాపూర్ మండలం జవహర్‌నగర్ మోడల్ స్కూల్‌లో తాత్కాలికంగా తరగతులు నిర్వహించనున్నారు. 2026–27 విద్యాసంవత్సరానికి ఈ నెల 21 నుంచి సెప్టెంబర్ 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అయితే దూరభారం దృష్ట్యా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
తెలంగాణ
ములుగు కేంద్రీయ విద్యాలయంలో ప్రారంభమైన అడ్మిషన్లు


