హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు: కలెక్టర్

GDWL: ఇందిరమ్మ ఇళ్లు, జలసిరి ఫార్మ్‌పాండ్ల పనుల్లో జాప్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్ రిజ్వాన్ బాషా స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వనమహోత్సవ మొక్కలను సంరక్షిస్తూ గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరచాలని సూచించారు.