హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'క్రీడలు శారీరక దృఢత్వానికి ఉపయోగకరం'

ASR: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని అరకు వేలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మైభారత్ విశాఖపట్నం, కళాశాల క్రీడల విభాగం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ డా సీహెచ్‌ కేశవరావు పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు వాలీబాల్‌, కబడ్డీ తదితర పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు ఆగస్టు 29న బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.