హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు ఆది హనుమాన్ రథోత్సవం

NRPT: మరికల్ మండల కేంద్రంలోని ఆది హనుమాన్ దేవాలయంలో శనివారం రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కమిటీ సభ్యులు కోరారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.