హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూలుగుతున్న ములుగు బస్‌స్టాండ్

ములుగు జిల్లా కేంద్రంలోని బస్‌స్టాండ్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత మేడారం మహాజాతరకు పూర్తికావాల్సిన పనులు అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యంతో ఇంకా కొనసాగుతున్నాయి. తాత్కాలిక బస్టాండ్ బురదమయంగా మారడంతో ఎండ, వానకు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని కోరుతున్నారు.