హైదరాబాద్: 28°C
తెలంగాణ

అత్యాచార ఘటనను తీవ్రంగా ఖండించిన ఏబీవీపీ

NRPT: మక్తల్ పట్టణంలో జరిగిన అత్యాచార ఘటనను ఏబీవీపీ మక్తల్ శాఖ తీవ్రంగా ఖండించింది. సందర్భంగా వారు మాట్లాడుతూ.. సిటీ కల్చర్ పేరుతో యువత మత్తుకు బానిస అవుతున్నారని, పోలీసుల నిఘా మరింత పటిష్టం చేయాలని, రాత్రిపూట పెట్రోలింగ్ నిబంధనలు కఠినతరం చేయాలని కోరారు. మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.