NRPT: మక్తల్ పట్టణానికి చెందిన పరశురాం (38) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. శుక్రవారం పని నిమిత్తం మాగనూరు మండలం వడ్వాట్ గ్రామానికి వెళ్లిన ఆయన, పని ముగించుకుని గ్రామ సమీపంలోని దత్తాత్రేయ ఆలయం వద్ద స్నానం చేసేందుకు బోరు మోటార్ ఆన్ చేశాడు. అప్పటికే వైరు తెగి ఉండటంతో విద్యుత్ సరఫరా డబ్బాకు చేరి, దానిని పట్టుకున్న పరశురాం అక్కడికక్కడే మృతి చెందాడు.
తెలంగాణ
కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి


