MNCL: శ్రీరాంపూర్ బస్టాండ్ సమీపంలో RTC బస్సు కింద పడి శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో అతడి రెండు కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న నస్పూర్ 108 సిబ్బంది ఈఎంటీ లక్ష్మయ్య, పైలెట్ సత్తయ్య ఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం క్షతగాత్రుడిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
RTC బస్సు కింద పడి వ్యక్తికి తీవ్రగాయాలు


