హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తిశ్రద్ధలతో నూలు పౌర్ణమి వేడుకలు

SDPT: బెజ్జంకిలో నూలు పౌర్ణమి సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక వాహనంపై మగ్గాన్ని ఏర్పాటు చేసి సంప్రదాయ పద్ధతిలో వస్త్రాన్ని నేస్తూ భజనలు, భక్తిగీతాలతో గ్రామంలో పర్యటించారు. చేనేత వృత్తి గొప్పతనాన్ని చాటుతూ నిర్వహించిన ఈ కార్యక్రమం ఆకట్టుకుంది. అంతరించిపోతున్న చేనేత కళను కాపాడేందుకు కృషి చేస్తున్నామన్నారు.