హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలలో టీవీ చోరీ కేసు ఛేదన

SDPT: ​వర్గల్ మండలం మీనాజీపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ నెల 19న చోరీకి గురైన 63 అంగుళాల టీవీ కేసును గౌరారం పోలీసులు ఛేదించారు. పాఠశాల కాంపౌండ్ గోడ దూకి టీవీని ఎత్తుకెళ్లిన మహేశ్‌కుమార్ (24) అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి దొంగిలించిన టీవీని స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.